- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US-Israel: హెజ్ బొల్లాపై దాడులకు సంబంధించిన సమాచారం లేదు
దిశ, నేషనల్ బ్యూరో: హెజ్ బొల్లా (Hezbollah) గ్రూపే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) చేసిన దాడులపై అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. వాటిపై తమకు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ముందుగా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రితో మాట్లాడేసరికే దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ‘‘మాకు ముందుస్తు సమాచారం లేదు. ఈ దాడులకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నేను ఇజ్రాయెల్ రక్షణమంత్రితో మాట్లాడాను. కొన్ని గంటల క్రితమే ఆపరేషన్ ప్రారంభమైందని అన్నారు. దాడులు, ఆ తర్వాత పరిస్థితుల గురించి అంచనా వేస్తున్నారు. నా దగ్గర చెప్పేందుకు తగినంత సమాచారంలేదు. మరిన్ని వివరాల కోసం ఇజ్రాయెల్ రక్షణ మంత్రితో ఫోన్ లో మాట్లాడతాను’’ అని లాయిడ్ వెల్లడించారు.
ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్ బొల్లా చీఫ్ కుమార్తె జైనబ్ చనిపోయింది. ఈ దాడిలో నస్రల్లా మరణించారా? లేదా సురక్షితంగా ఉన్నారా? అనే దానిపై స్పష్టత లేదు. అతడు సురక్షితంగా ఉన్నారని హెజ్‌బొల్లా వర్గాలు చెబుతున్నా.. ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉందని అంటోంది. మరోవైపు, నస్రల్లాతో కమ్యూనికేషన్ కట్ అయినట్లు తెలుస్తోంది. నస్రల్లా గురించి ఇరాన్ కూడా వెతుకుతున్నట్లు సమాచారం.