గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ను కలిసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

by Javid Pasha |
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ను కలిసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ను అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ కేంద్రమంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇండియా స్టాక్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి ఇరువురు చర్చించారు. అంతర్జాతీ ఐటీ కంపెనీలతో పాటు దేశీయ ఐటీ కంపెనీల అభివృద్ధి గురించి కూడా మంత్రి పిచాయ్ తో చర్చించినట్లు సమాచారం.

Advertisement

Next Story