కొత్త రకం గుర్తు తెలియని కొవిడ్ వేరియంట్.. ఇద్దరిలో గుర్తింపు

by Harish |
కొత్త రకం గుర్తు తెలియని కొవిడ్ వేరియంట్.. ఇద్దరిలో గుర్తింపు
X

జెరుసాలెం: ఇజ్రాయిల్‌లో కొత్త కొవిడ్-19 వేరియంట్ కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఈ గుర్తు తెలియని వేరియంట్ ను గుర్తించినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ వెల్లడించింది. ఇది బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయికతో కూడుకున్నదిగా భావిస్తున్నట్లు తెలిపారు. బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన పీసీఆర్ టెస్టులో వీరిద్దరిలో కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించారు. ఇద్దరి శాంపిల్స్ ను సీక్వెన్సింగ్ కు పంపించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరువురిలో గుర్తించిన వేరియంట్ అసాధారణమైనదని ప్రొఫెసర్ సల్మాన్ జర్ఖా తెలిపారు. జన్యు మార్పిడి ఫలితంగా వైరస్ కొత్త వైవిధ్యం ఏర్పడిందని చెప్పారు.

బాధితులిద్దరిలో తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భారత్ లో తాజాగా కరోనా కేసులు ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షలు, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed