మానవ హక్కులను కాలరాస్తూ ‘ఇజ్రాయెల్ - హమాస్’ యుద్ధం: ఐరాస

by Hajipasha |   ( Updated:2024-02-29 12:46:06.0  )
మానవ హక్కులను కాలరాస్తూ ‘ఇజ్రాయెల్ - హమాస్’ యుద్ధం: ఐరాస
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చీఫ్ వోల్కర్ టర్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంతో సంబంధమున్న అన్ని పక్షాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. వాటిపై దర్యాప్తు చేసి, బాధ్యులకు తగిన శాస్తి జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను కాలరాసేలా ఈ యుద్ధం జరిగిందని చెప్పడంలో సందేహం లేదన్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌ సమావేశంలో వోల్కర్ టర్క్ ఈ కామెంట్స్ చేశారు. శాంతి, విచారణ, జవాబుదారీతనంలపై ఫోకస్ చేసే సమయం గడిచిపోయిందని, పరిస్థితులు చేయి దాటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాలోని గాజా, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మానవ హక్కుల పరిస్థితిపై ఓ నివేదికను ఈసందర్భంగా వోల్కర్ టర్క్ విడుదల చేశారు. ఇజ్రాయెల్ దళాలు చేసిన అనేక యుద్ధ నేరాల గురించి ఈ నివేదికలో ప్రస్తావించారు. ఇజ్రాయెల్ బలగాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ విచక్షణారహితంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెలీలను కిడ్నాప్ చేయడం, దక్షిణ ఇజ్రాయెల్‌పైకి రాకెట్లను ప్రయోగించడం ద్వారా పాలస్తీనా సాయుధ గ్రూపులు కూడా హింసకు దిగాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed