- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్ వేలం వేశారు..! షాకింగ్ ధర పలికింది
దిశ, వెబ్‌డెస్క్ః అభిమానం, జాలి ఎంతటి కఠిన గుండెనైనా కదిలిస్తుంది. రాజకీయాల మాట అటుంచి, రష్యా దాడికి గురైన ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఎంతో గౌరవం దక్కింది. శక్తికిమించి ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి నైతిక మద్దతు దొరికింది. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ శరణార్థులను ఆదరించడంతో పాటు, ఉక్రెయిన్‌లోని యుద్ధ బాధితులకు తోచిన సాయం అందుతోంది. ఈ క్రమంలోనే ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ధరించిన జాకెట్ కూడా అందులో భాగమయ్యింది. యుద్ధంలో దెబ్బతిన్న తన దేశంలోని వీధుల గుండా నడుస్తున్నప్పుడు, అలాగే, రష్యాతో వివాదం మధ్య తన పౌరులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలియజేయడంలో భాగంగా లండన్ ప్రధాని ఉక్రెయిన్ పర్యటించినప్పుడు జెలెన్స్కీ ధరించిన ఖాకీ ఉన్ని జాకెట్ ఇప్పుడు వేలం వేశారు.
Zelenskyy ట్రేడ్‌మార్క్ జాకెట్‌ను లండన్‌లోని టేట్ మోడరన్‌లో నిర్వహించిన "బ్రేవ్ ఉక్రెయిన్" నిధుల సమీకరణ కార్యక్రమంలో వేలం వేయగా, 90,000 పౌండ్ల భారీ మొత్తంలో అంటే, దాదాపు రూ. 86 లక్షలకు అమ్ముడుపోయింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో పాటు UK PM బోరిస్ జాన్సన్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ను రక్షించడానికి మేము చేయగలిగినదంతా చేస్తామని బోరిస్ జాన్సన్ అన్నారు. ది డైలీ మెయిల్ ప్రకారం, జెలెన్స్కీ 'ప్రసిద్ధ ఖాకీ జాకెట్' ప్రారంభ వేలం ధర 50,000 పౌండ్లు అయితే, ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్యక్తిగతంగా సంతకం చేసిన ఈ జాకెట్ కోసం ఎక్కువ వేలం వేయాలని బోరిస్ జాన్సన్ కొనుగోలుదారులను కోరినట్లు తెలుస్తుంది.ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్ వేలం వేశారు..! షాకింగ్ ధర పలికింది