UK:యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం..జైళ్లలో ఉంటున్న 5500 మంది ఖైదీల విడుదల..!

by Maddikunta Saikiran |
UK:యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం..జైళ్లలో ఉంటున్న 5500 మంది ఖైదీల విడుదల..!
X

దిశ, వెబ్‌డెస్క్:యూకే(UK)లో కొత్తగా ఏర్పడిన లేబర్(Labour) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆ దేశంలో ప్రస్తుతం జైళ్లలో ఉంటున్న దాదాపు 5500 మంది ఖైదీలను(prisoners) రిలీజ్ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1,700 మంది ఖైదీలను బుధవారం ఉదయాన్నే విడుదల చేసింది.ఇది సాధారణంగా ప్రతి వారం విడుదలయ్యే 1,000 మంది ఖైదీలకు అదనం.అధికారిక గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్(England), వేల్స్(Wales) జైళ్లలో దాదాపు 88,500 కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు .దీంతో జైళ్లలో రద్దీ తగ్గించే లక్ష్యంతో ఖైదీలను విడుదల చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.అయితే యూకే వ్యాప్తంగా 5,500 జైలు పడకలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఖైదీలను రిలీజ్ చేస్తున్నారు.కాగా ముందుగా విడుదలైన ఖైదీలలో ఐదేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్నవారే ఉన్నారు. ఖైదీలలో ఎవరైతే 50%, 40% శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రమే విడుదల చేసేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఇందులో లైంగిక , ఉగ్రవాదం,గృహహింస, హింసాత్మక వేధింపులు వంటి నేరాలకు శిక్ష అనుభవిస్తున్న వారిని మాత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ఇదిలా ఉంటే లేబర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ ,వేల్స్ బాధితుల కమీషనర్ బారోనెస్ న్యూలవ్(Baroness Newlove) మాట్లాడుతూ.. "కోర్టు విధించిన శిక్షను నేరస్థులు అనుభవిస్తారని ఆశించే చాలా మంది బాధితులకు ఈ వార్త బాధ కలిగిస్తోందని" అన్నారు. అలాగే ఇంతమంది ఖైదీలు ఒకేసారి బయటకు రావడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో అన్నారు.కాగా బుధవారం విడుదల చేసిన 1,700 మంది ఖైదీలతో పాటు, అక్టోబర్ లో మరో 2,000 మంది ఖైదీలు విడుదలవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.దీంతో లేబర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి మేలు చేస్తుందా? లేదంటే హాని కలిగిస్తుందా? అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed