Typhoon Yagi: వియత్నాంలో యాగి తుఫాన్ భీభత్సం..179కు పెరిగిన మృతుల సంఖ్య

by Maddikunta Saikiran |
Typhoon Yagi: వియత్నాంలో యాగి తుఫాన్ భీభత్సం..179కు పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: వియత్నాం(Vietnam)లో యాగి తుఫాన్(Yagi Typhoon) విధ్వంసం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.వరదలు సంభవించడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ టైఫూన్ కారణంగా ఇప్పటి వరకు 179 మంది మరణించగా, మరో 59 మంది గల్లంతయ్యారని ఆ దేశ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ(Ministry of Agriculture and Rural Development) బుధవారం ప్రకటించింది.ఇక మృతుల్లో 45 మంది లావో కై ప్రావిన్స్‌(Lao Cai Province)కు చెందినవారు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌(Yen Bai Province)కు చెందినవారు, 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌(Cao Bang Province)కు చెందినవారు ఉన్నట్లు తెలిపింది.ఆకస్మిక వరదల కారణంగానే మరణాలు సంభవించాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే వియత్నాం రాజధాని హనోయి(Hanoi)లోని రెడ్ రివర్‌(Red River) ఉధృతంగా ప్రవహిస్తుడంతో ప్రభుత్వం మూడో ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. అలాగే గురువారం మధ్యాహ్నానికి థావో నది(Thao River) నీటి మట్టం పెరిగి,దాని సమీప ప్రాంతాలలో వరదలు పోటెత్తుతాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియోరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్(National Center for Hydro-Meteorological Forecasting) హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలో ఈ వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని,పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా గత 30 ఏళ్లలో వియాత్నాంను తాకిన అత్యంత విధ్వంసకర తుఫాన్ ఇదేనని ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed