Turkey Syria Earthquakes : ప్రపంచంలో గత 25 ఏళ్లలో సంభవించిన భయానక భూకంపాలివే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-10 06:00:52.0  )
Turkey Syria Earthquakes : ప్రపంచంలో గత 25 ఏళ్లలో సంభవించిన భయానక భూకంపాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎటూ చూసిన కూలిన భవనాలు, వాటి కింద బయటపడుతున్న మృతదేహాలు, చలిని తట్టుకోలేక వణికి పోతున్న జనం ప్రస్తుతం తుర్కియే, సిరియాల్లో ఈ హృదయవిదారక దృ‌శ్యాలు దర్శనమిస్తున్నాయి. తుర్కియే(టర్కీ), సిరియా దేశాల్లో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వేళ ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకు 19వేల మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ బలగాలు ఈ రెండు దేశాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భూకంప బాధిత తుర్కియేలోని హతాయ్ ప్రావిన్స్‌లో భారత సైన్యం తాత్కాలిక హాస్పిటల్ నెలకొల్పి అత్యవసర వైద్య సేవలందిస్తోంది. అయితే ప్రపంచంలో భయానక భూకంపాలు వేల మందిని బలిగొన్నాయి. తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి.

భయానక భూకంపాలివే..

2022 జూన్ 22న అఫ్గానిస్తాన్ లో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపధాటికి 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు.

2021 అగస్ట్ లో హయతిలో 7.2 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్ విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా 2,200 మంది మృతి చెందారు.

2018 సెప్టెంబర్ 28న 7.5 తీవ్రతతో ఇండోనేషియాలో వచ్చి భూకంపం సునామీలా మారి 4,300 మంది ప్రాణాలు బలికొంది.

2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో 7.8 మ్యాగ్నిట్యూడ్‌తో వచ్చిన భూకంపం 8,800 మందిని బలికొంది.

2011 మార్చి 11న నార్త్ వెస్ట్ కోస్ట్ జపాన్‌లో 9.0 తీవ్రతతో భూకంపం రాగా 18,400 మంది ప్రాణాలు కోల్పోయారు.

2010 జనవరి 12న హయతిలో భూకంపం రాగా లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. 7.0 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. అయితే అక్కడి ప్రభుత్వం 3లక్షల 16వేల మంది చనిపోయినట్లు అంచనా వేసింది.

2008 మే 13న చైనాలోని సిచ్వాన్ లో 7.9 తీవ్రతతో భూకంపం రాగా 87,500 మంది చనిపోయారు.

2006 మే 27న ఇండోనేషియాలోని ఐస్ లాండ్ ఆఫ్ జావాలో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం 5,700 మందిని బలిగొంది.

2005 అక్టోబర్ 8న పాకిస్థాన్ లోని కశ్మీర్ రీజియన్ లో 7.6 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపంలో 80వేల మందికిపైగా ప్రాణాలు విడిచారు.

2005 మార్చి 28న ఇండోనేషియాలోని నార్తర్న్ సుమత్రా ప్రాంతంలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 1,300 మంది చనిపోయారు.

2004 డిసెంబర్ 26న 9.1 తీవ్రతతో ఇండోనేషియాలోని ఇండియన్ ఓసీన్ సునామీలో 2లక్షల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

2003 డిసెంబర్ 26న 6.6 తీవ్రతతో సౌత్ ఈస్ట్రన్ ఇరాన్‌లో భూకంపం సంభవించగా 20,000 మంది చనిపోయారు.

2003 మే 21న అర్జెరియాలో 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 2,200 మందిని బలిగొంది.

2001 జనవరి 26న మనదేశంలోని గుజరాత్‌లో భూకంపం రాగా 20,000 మంది ప్రాణాలు వదిలారు.

1999 అగస్ట్ 17న టర్కీ(తుర్కియే)‌లో 7.6 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం రాగా 18,000 మంది చనిపోయారు.

1998 మే 30న అఫ్గానిస్తాన్ లోని బదక్షాన్ ప్రావిన్స్ లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో 4,000మంది చనిపోయారు.

ఈనెల 6న తుర్కియే, సిరియాలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 20వేలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శిథిలాలను వెలికితీస్తే మొత్తం చనిపోయిన వారెంత అనే దానిపై క్లారిటీ రానుంది. కాగా 25 ఏళ్లలో భూకంపాల ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 8,17,300 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో మూగజీవాలు సైతం మృతిచెందాయి.

Advertisement

Next Story

Most Viewed