ఇజ్రాయెల్ ఎంబసీపై కాలిపోతున్న వస్తువుతో దాడి.. అనుమానితుడి అరెస్ట్

by Harish |   ( Updated:2024-03-21 12:45:21.0  )
ఇజ్రాయెల్ ఎంబసీపై కాలిపోతున్న వస్తువుతో దాడి.. అనుమానితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో గురువారం ఉదయం నెదర్లాండ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపైకి కాలిపోతున్న వస్తువును విసిరారు. ఈ ఘటన ఉదయం 10:50 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు డచ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడుల తర్వాత గాజాలో ఇజ్రాయిల్ సైన్యం దాడికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల చుట్టూ భద్రతను పెంచారు. ఇటీవల బెదిరింపులు రాగా, హేగ్‌లోని ఎంబసీ వద్ద కూడా నెదర్లాండ్స్ అదనపు భద్రతను మోహరించింది, అయితే తాజాగా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంతకుముందు ఫిబ్రవరిలో కూడా హేగ్‌లోని ఇజ్రాయెల్ రాయబారి అధికారిక నివాసంలో బాంబు ఉన్నట్లుగా సమాచారం రాగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు దొరకలేదు.

Advertisement

Next Story