అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

by M.Rajitha |
అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల(Nobel Prizes 2024) గ్రహీతల వివరాలను స్వీడన్ లోని నోబెల్ బృందం విడుదల చేసింది. గతవారం వివిధ రంగాలలో నిష్ణాతులకు పురస్కారాలను ప్రకటించగా.. తాజాగా నేడు అర్థశాస్త్రంలో డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్‌లకు 2024వ సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాన్ని స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. రాజకీయ సంస్థలు ఎలా ఏర్పడతాయి, అవి ప్రజా శ్రేయస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం మీద వీరు ముగ్గురు వెలువరించిన అధ్యయనాలకు గాను ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందనున్నారు.

స్వీడన్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేస్తారు. కాగా గతవారం వరుసగా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో వైద్య, భౌతిక, రసాయనశాస్త్ర, సాహిత్య రంగాలతోపాటు శాంతి స్థాపనకు కృషిచేస్తున్న జపాన్ సంస్థ నోబెల్ బహుమతి అందుకోగా.. తాజాగా సోమవారం అర్థశాస్త్ర రంగంలో ముగ్గురు నోబెల్ బహుమతి అందుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed