'ఇక్క‌డే అబార్ష‌న్లు చేయ‌బ‌డును'.. Google కొత్త ఫెసిలిటీ!

by Sumithra |   ( Updated:2022-08-26 12:46:45.0  )
ఇక్క‌డే అబార్ష‌న్లు చేయ‌బ‌డును.. Google కొత్త ఫెసిలిటీ!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇటీవ‌ల కాలంలో యునైటెడ్ స్టేట్స్‌లో గ‌ర్భ‌స్రావాల విష‌యంలో తీవ్ర చ‌ర్చ కొన‌సాగుతోంది. దీనిపై కోర్టుల వైఖ‌రి కూడా స్పష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌రింత గంద‌ర‌గోళం నెల‌కొంది. అయితే, తాజాగా ఈ అంశంలోకి గూగుల్ ప్ర‌వేశించింది. Google కార్య‌నిర్వ‌హ‌ణాధికారి గురువారం అమెరిక‌న్ కాంగ్రెస్‌కు అందించిన సమాచారం ప్రకారం, అబార్షన్ చేయ‌ని కేంద్రాల విష‌యంలో గందరగోళాన్ని నివారించడానికి యునైటెడ్ స్టేట్స్‌లో గర్భస్రావాలను అందించే వైద్య సదుపాయాలను గూగుల్ సెర్చ్‌ ఫలితాల్లో, గూగుల్‌ మ్యాప్స్‌లో స్పష్టంగా గుర్తించే సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు తెలిపారు.

Google వైస్ ప్రెసిడెంట్ మార్క్ ఇసాకోవిట్జ్ ఒక లేఖలో, వినియోగదారులు "abortion clinics near me (నాకు సమీపంలో ఉన్న అబార్షన్ క్లినిక్‌లు)" కోసం శోధించినప్పుడు, రిజ‌ల్ట్‌ బాక్స్ ఆ స్థానాలను చూపుతుందని పేర్కొన్నారు. ఇవ‌న్నీ అబార్షన్లు అందించడానికి ధృవీకరించబడ్డ కేంద్రాల‌ని వెల్ల‌డించారు. ఇక‌, ఈ ఇంటర్నెట్ దిగ్గజం గర్భస్రావాలు అందించని కేంద్రాల‌ నుండి సంబంధిత స‌మాచారాన్ని గూగుల్‌లో చేర్చడానికి, వాటి సెర్చ్‌ను విస్తరించడానికి వినియోగదారులను కూడా అనుమతిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed