ఆ నగరంలో దట్టమైన చీకటి.. రెండు నెలల పాటు ఉదయించని సూర్యుడు..

by Sumithra |   ( Updated:2024-12-01 16:15:06.0  )
ఆ నగరంలో దట్టమైన చీకటి.. రెండు నెలల పాటు ఉదయించని సూర్యుడు..
X

దిశ, వెబ్ డెస్క్ : చలికాలంలో ఒక్కరోజు కూడా సూర్యుడు ఉదయించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రెండు నెలల పాటు సూర్యుడు మీ చుట్టూ ప్రకాశించకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం రోజువారీ పనులను ఎలా పూర్తి చేసుకోగలం. సూర్యకాంతి లేకుండా ఎలా జీవిస్తాం. అది కూడా ఎముకలు కొరికే శీతాకాలంలో. ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది కదా. కానీ ఓ దేశంలో మాత్రం శీతాకాలంలో రెండు నెలల పాటు సూర్యోదయమే అవ్వదంట. వామ్మో వింటుంటేనే ఒల్లు జలదరిస్తుంది. మరి అక్కడ ఉన్నవారి పరిస్థితి ఏంటో కదా. ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, ఎందుకు రెండు నెలల పాటు సూర్యోదయం అవ్వదో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని అలాస్కాలో ఒక చిన్న పట్టణం ఉంది. దాని పేరు ఉత్కియాగ్విక్. దాదాపు 2 నెలల తర్వాత ఈ నగరంలో సూర్యుడు ఉదయించనున్నాడు. ఉత్కియావిక్‌లో చివరిసారిగా నవంబర్ 18న సూర్యోదయం జరిగింది. ఇప్పుడు సరిగ్గా 64 రోజుల తర్వాత అంటే జనవరి 22న ఈ నగరంలో సూర్యోదయం అవుతుంది. ఈ నగరం 64 రోజుల పాటు అంధకారంలో ఉంటుంది.

అలాస్కాలో 2 నెలల పాటు సూర్యాస్తమయం..

ఆర్కిటిక్ సముద్రానికి సమీపంలో అలస్కా ఉత్తర వాలులో ఉన్న బారో అని పిలువబడే ఉత్కియాగ్విక్‌లో సుమారు 5 వేల మంది నివసిస్తున్నారు. ఉత్తరాన ఉన్న ప్రదేశం కారణంగా నగరం ప్రతి సంవత్సరం సూర్యోదయం లేకుండా చాలా రోజులు గడుపుతుంది. నవంబర్ 18న, సూర్యుడు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:27కి అస్తమించాడు. ఇప్పుడు 64 రోజుల తర్వాత, జనవరి 22న దాదాపు 1:15 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. అది కూడా 48 నిమిషాలు మాత్రమే. అంటున్నారు పరిశోధకులు.

అయితే ఇది ఎలా సాధ్యం ?

వాస్తవానికి, భూమి దాని అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి ఉంటుంద. దీని కారణంగా సూర్యరశ్మి దానిలో కొంత భాగాన్ని చేరుకోదు. దీని కారణంగా, భూమి ఉత్తర, దక్షిణ భాగాలలో ఉన్న ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం పోలార్ నైట్ సంభవిస్తుంది. అంటే ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం సూర్యోదయం చాలా రోజులు జరగదు. పోలార్ నైట్ వ్యవధి 24 గంటల నుండి దాదాపు 2 నెలల వరకు ఉంటుంది.

సూర్యోదయం లేకుండా ప్రజలు ఎలా జీవిస్తారు ?

సూర్యోదయం లేకుండా నగరం పూర్తిగా చీకటిలో ఉండదు. ఆ నగరంలో ఏర్పాటు చేసిన లైట్లు సాధారణంగా పగటిపూటలా ప్రకాశిస్తాయి. అయితే, సూర్యకాంతి లేకుండా ఎక్కువ కాలం జీవించడం ఇక్కడ నివసించే ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అలాగే, ఈ ప్రాంతంలోని ప్రజలు విపరీతమైన చలిని ఎదుర్కోవలసి వస్తుంది.

3 నెలల పాటు సూర్యుడు అస్తమించడు..

ఇక మరో విశేషమేమిటంటే ఈ నగరం సుమారు 2 నెలలు సూర్యోదయం లేకుండా ఎలా బతుకుతుందో, అదే విధంగా ఇక్కడ ప్రజలు సూర్యాస్తమయం లేకుండా 3 నెలలు జీవించి ఉంటారు. 11 మే 2025 నుండి 19 ఆగస్టు 2025 వరకు బారోలో అంటే ఉత్కియాగ్విక్‌లో సూర్యుడు అస్తమించడు. వాస్తవానికి, భూమి ఉత్తర, దక్షిణ ధ్రువంలో ఉన్న అనేక ప్రాంతాలలో, సంవత్సరంలో చాలా రోజులు, సూర్యోదయం ఒకసారి మాత్రమే జరుగుతుంది. సూర్యాస్తమయం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.

Read More...

Jaipur: వెయ్యేళ్లనాటి కోట.. చెక్కుచెదరని బురుజులు




Advertisement

Next Story

Most Viewed