BRS: నన్ను కాల్చి చంపినా ఇలాగే ఉంటా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Ramesh Goud |
BRS: నన్ను కాల్చి చంపినా ఇలాగే ఉంటా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నన్ను కాల్చి చంపినా.. నోరు లేని పేద బిడ్డల పక్షపాతిగానే ఉంటానని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) స్పష్టం చేశారు. హయత్ నగర్(Hayath Nagar) గురుకుల విద్యాలయాన్ని(Gurukula Vidhyalayam) సందర్శించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్.. మీ సోషల్ మీడియా లీకులు, మీరిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మతిస్థిమితం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, మరెందరో చిల్లర మూకలు నాపై చేస్తున్న దాడికి నేను బెదరనని చెప్పారు. అలాగే మీరేసే తాయిలాలకు గతంలో లొంగలేదు.. భవిష్యత్తులో కూడా లొంగనని అన్నారు. మీరు స్కూళ్లకు తాళాలు వేసుకుంటెనో, పోలీసులతో మమ్ముల అరెస్టు చేయిస్తేనో మా గురుకుల బాట ఆగుతదనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరుండరు అని వ్యాఖ్యానించారు.

ఇక అసలు విషయానికొస్తే.. మీరు ఎందుకు నిజాలను దాచిపెట్టాలని అనుకుంటున్నారో ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకపోతే వాటిని చెప్పాల్సిన బాధ్యత మా పిల్లలకోసం మా పార్టీ(BRS Party) పై ఉందన్నారు. మీ బంగళాలో బతికే నలుగురి కోసం నలభై మంది పనిచేయొచ్చు కానీ, మా పేద పిల్లలు చదువుకునే హయత్ నగర్ ప్రతిభా పాఠశాలలో 600 మంది విద్యార్థుల స్కూల్ ను శుభ్రం చేయడానికి కేవలం ఒకటే ఒక వృద్ద మహిళను ఎట్ల పెడుతరు? అని, అదీ ఆమెకు టైం కు జీతాలు ఇవ్వకుండా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన పేద పిల్లలను ఎంట్రన్స్ ద్వారా సెలక్టు చేసి వాళ్లకు అవసరమైన ఉపాధ్యాయులను ఇవ్వకపోతే వాళ్ల భవిష్యత్ కు భరోసా ఎవ్వరని అడిగారు. హయత్ నగర్లో ఇంటర్మీడియట్ కు ఇప్పటికీ ఇద్దరు జూనియర్ లెక్చరర్స్ లేరని పిల్లలు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. వాళ్లు పరీక్షలు ఎట్ల పాసైతరు? అని, మీ పిల్లలకు టీచర్లు లేకపోతే మీరు ఊరుకుంటారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి దాపురించిన పరిస్థితిని మీరెట్ల చూస్తరు అని అన్నారు.

ఇక బ్లాక్ అయి అత్యంత దుర్గంధం వెదజల్లుతున్న టాయిలెట్లు ఉంటే విద్యార్థులు కాలకృత్యాలు ఎట్ల తీర్చుకుంటరు? అని విధిలేక రోజూ బహిరంగ మల విసర్జనకు చీకట్లో ఈ పేద బిడ్డలు భయంభయంగా పోతున్నారని తెలిపారు. అడవుల్లో వాళ్లకు ఏమైనా పాములు తేళ్లు కరిస్తే వాళ్ల ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అంటూ.. రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన పేద పిల్లలను ఎంట్రన్స్ ద్వారా సెలక్టు చేసి వాళ్లకు అవసరమైన ఉపాధ్యాయులను ఇవ్వకపోతే వాళ్ల భవిష్యత్ కు భరోసా ఎవ్వరు? అని నిలదీశారు. కుళ్లిపోయిన కూరగాయలతో పిల్లలకు వంటలెట్ల చేస్తరు? మీ ఇంట్లో అట్లనే తింటారా? అని మండిపడ్డారు. యూనిఫాంలు, దుప్పట్లు, బెడ్లు, బూట్లు లేకుండా, రోజూ అడవుల్లో ఈగలు దోమల మధ్య చదవడానికి ఈ పిల్లలు ఏమైనా పశువులా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీకు ధమ్ముంటే బంగళా నుండి బయటికొచ్చి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల్లోకి వెళ్లాలని, మీ సైకో-రౌడీ కుట్రలు బంజేసి, పరిపాలన మీద దృష్టి సారించండి అని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed