మెట్రో స్టేష‌న్‌లో పావురాళ్ల‌ను త‌ర‌మ‌డానికి గ‌ద్దకు ఉద్యోగం! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-10-22 14:01:36.0  )
మెట్రో స్టేష‌న్‌లో పావురాళ్ల‌ను త‌ర‌మ‌డానికి గ‌ద్దకు ఉద్యోగం! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భారీ క‌ట్ట‌డాల్లో పావురాలు నివాసం ఉండ‌టం సాధార‌ణంగా చూస్తుంటాము. అయితే, వాటి వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నివాస భ‌వ‌నాలకు ఈ ఇబ్బంది ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో మెట్రో స్టేష‌న్‌లో కూడా పావురాల వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిని నియంత్రించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌రికి, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మెట్రో సిస్ట‌మ్, పావురాల‌ను భ‌య‌ప‌ట్ట‌డానికి పాక్-మ్యాన్ అనే వేట గ‌ద్ద‌ని అద్దెకు తీసుకుంది. 5 ఏళ్ల వ‌యసున్న ఈ హారిస్ గ‌ద్ద ఉద్యోగం పావురాల కోసం వెతకడం. ఇది ఎల్ సెరిటో డెల్ నోర్టే స్టేషన్‌లో త‌న ప‌ని ప్రారంభించింది. దీనికి సంబంధించి, బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BART)తో ప్యాక్-మ్యాన్ హ్యాండ్లర్ రికీ ఓర్టిజ్ ఫాల్కన్ ఒప్పందం చేసుకున్నారు. ప్లాట్‌ఫారమ్‌లను తీయడానికి ముందు స్టేష‌న్‌ కింద ఉన్న‌ ప్రవేశద్వారం వద్ద వారి రోజవారి ప‌నిని ప్రారంభమ‌వుతుంది. ఈ గ‌ద్ద వారానికి మూడు రోజులు గస్తీ నిర్వహిస్తుంది. ఇది స్టేషన్‌లోని అంచుల‌పైన‌, లోప‌లున్న‌ పరంజాపైన ఉండే పావురాలను త‌రిమేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed