మరింత ముదిరిన వివాదం.. ఆ దేశంతో సంబంధాలు తగ్గించుకోవలని కేంద్రం నిర్ణయం

by Gantepaka Srikanth |
మరింత ముదిరిన వివాదం.. ఆ దేశంతో సంబంధాలు తగ్గించుకోవలని కేంద్రం నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - కెనడా(Canada) మధ్య దౌత్య వివాదం మరింత ముదిరింది. దీంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కెనడాతో దౌత్య సంబంధాలు తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి భారత హై కమిషనర్‌(Indian High Commissioner)ను వెనక్కు కేంద్రం పిలిపించింది. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది. హైకమిషనర్‌తో పాటు మిగిలిన దౌత్య సిబ్బంది మొత్తం ప్రస్తుతం ఇండియాకు తిరిగి వస్తోంది.

ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ గతంలో కెనడా ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తు్న్నట్టు మండిపడింది. కెనడా గడ్డపై ఖలిస్థాన్ అనుకూలవాదులకు చోటు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఇరుదేశాల మధ్య ప్రధాన అంశం ఏదైనా ఉండే ఇదేనని చెప్పింది. భారత్‌లో వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని మంత్రివర్గంలో చేర్చుకోవడాన్ని గుర్తుచేసింది. తాజాగా ఈ వివాదం మరింత ముదరడంతో భారత సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed