James Cameron : మునిగిపోయిన టైటానిక్ దగ్గరకు 33 సార్లు వెళ్లిన డైరెక్టర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-23 09:20:17.0  )
James Cameron : మునిగిపోయిన టైటానిక్ దగ్గరకు 33 సార్లు వెళ్లిన డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సముద్ర గర్భంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన సాహస యాత్ర విషాదంతం అయింది. ఐదుగురు మృతి చెందినట్లు యూఎస్ కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు. అయితే అవతార్, అవతార్ 2, టైటానిక్ చిత్రాలను తీసిన డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ టైటానిక్ షిప్ మునిగిన ప్రదేశాన్ని 33 సార్లు సందర్శించారు. 13వేల అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు. ‘ఈ భూమి మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అది ఒకటి’ అని జేమ్స్ కెమెరూన్ అన్నారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న ఆకాంక్షతోనే టైటానిక్ మూవీ తీశానన్నారు. సినిమాను బాగా చూపించాలని టైటానికి మునిగిన ప్రదేశాన్ని ఎక్కవ సార్లు సందర్శించానని తెలిపారు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం కెమెరూన్ ఎవరూ చేయలేని సాహసాన్ని చేశారు. ప్రపంచలోనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం పసిఫిక్ సముద్రంలోని మెరైనా ట్రెంచ్ అడుగు భాగానికి ఒక్కరే వెళ్లారు.

బీచ్‌లో బుల్లితెర బ్యూటీ అరాచకం.. హీరోయిన్లను మించిన బోల్డ్ షో (ఫొటోస్)

Advertisement

Next Story

Most Viewed