కోహినూర్ ను బలవంతంగానే లాక్కెళ్లాం.. అంగీకరించిన బ్రిటన్ రాజ కుటుంబం   

by Javid Pasha |
కోహినూర్ ను బలవంతంగానే లాక్కెళ్లాం.. అంగీకరించిన బ్రిటన్ రాజ కుటుంబం   
X

లండన్ : కోహినూర్ వజ్రాన్ని ఇండియా నుంచి బ్రిటీషర్లు బలవంతంగానే లాక్కెళ్లి పోయారని తేలింది. 1849లో బ్రిటీష్‌వారు పంజాబ్‌ను ఆక్రమించారు. అప్పుడు పంజాబ్ పాలకుడిగా మహారాజా రంజిత్ సింగ్‌ 11 ఏళ్ళ కుమారుడు దిలీప్ సింగ్ ఉన్నాడు. అతడిని ఆంగ్లేయులు బలవంతం చేయబట్టే ఆ డైమండ్ ను ఇచ్చేశాడని వెల్లడైంది. కోహినూర్ వజ్రాన్ని తీసుకోవడమే కాదు .. దిలీప్ సింగ్ ను మతం మార్చి దత్తత కింద ఇంగ్లండ్ కు తీసుకెళ్లారు. బ్రిటన్‌లోని టవర్ ఆఫ్ లండన్‌లో రాయల్ ఆభరణాల ప్రదర్శనను ఇటీవల ఏర్పాటు చేశారు. ఇందులో మొదటిసారిగా కోహినూర్‌తో సహా అనేక విలువైన వజ్రాలు, ఆభరణాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఒక్కో వస్తువు చరిత్ర గురించి వీడియోలు, పోస్టర్లను ప్రదర్శించారు. గోల్కొండ గనుల నుంచి కోహినూర్‌ వజ్రాన్ని వెలికితీశారని.. అక్కడి నుంచి మహారాజా దిలీప్ సింగ్ కు.. అతడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరిందని ఒక వీడియో, పోస్టర్లలో స్పష్టంగా ఉంది. వీటిలో కోహినూర్ ను 'విజయ చిహ్నం'గా బ్రిటీషర్లు అభివర్ణించారు. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని రాయల్ కలెక్షన్ ట్రస్ట్ ఆమోదం పొందిన తర్వాతే కోహినూర్‌ వజ్రం చరిత్ర వివరాలను ఈవిధంగా నమోదు చేశారు. ఈ లెక్కన దీన్ని బ్రిటన్ రాజ కుటుంబం పరోక్ష ప్రకటనగా భావించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed