ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన థాయ్‌లాండ్‌ కొత్త ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రా

by Maddikunta Saikiran |
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన థాయ్‌లాండ్‌ కొత్త ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రా
X

దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్‌ కొత్త ప్రధానిగా ఇటీవల పేటోంగ్‌టార్న్ షినవత్రా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ 'X' వేదికగా షినవత్రాకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో, పేటోంగ్‌టార్న్ షినవత్రా ఒక పోస్ట్‌లో, మీ హృదయపూర్వక అభినందనలు తెలియచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని రాశారు.అలాగే మన మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ముఖ్యంగా వాణిజ్యం మరియు పెట్టుబడులు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి అలాగే రెండు దేశాల మధ్య విమాన ప్రయాణాన్ని పెంచడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ఆమె 'X' వేదికగా తెలిపారు.

37 ఏళ్ల పేటోంగ్‌టార్న్ షినవత్రా ఆగస్ట్ 16న థాయ్‌లాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు, థాయ్ చరిత్రలో ఆ పదవిని చేపట్టిన రెండవ అతి పిన్న వయస్కురాలుగా ఆమె గుర్తింపు పొందారు.అలాగే షినవత్రా కుటుంబం నుంచి థాయిలాండ్ ప్రధాన మంత్రిగా పనిచేసిన మూడవ వ్యక్తి గా రికార్డులోకి ఎక్కింది. ఆగస్టు 14న నైతిక ఉల్లంఘన కేసులో అప్పటి ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్‌ను కోర్టు తొలగించిన తర్వాత పేటోంగ్‌టర్న్ షినవత్రా ప్రధానిగా ఎన్నికయింది. పేటోంగ్‌టార్న్,అలాగే మాజీ ప్రధాని స్రెట్టా థావిసిన్‌ ఇద్దరూ ఫ్యూ థాయ్ పార్టీకి చెందినవారు.

Advertisement

Next Story

Most Viewed