హోటల్‌పై ఉగ్రదాడి.. 32 మంది దుర్మరణం

by Gantepaka Srikanth |
హోటల్‌పై ఉగ్రదాడి.. 32 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: సోమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో దాదాపు 32 మందికి పైగా దుర్మరణం చెందారు. మరో 63 మంది తీవ్ర గాయాలు అయ్యాయి. దాడికి తామే కారణమని ఆల్‌కైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ ప్రకటన విడుదల చేసింది. సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ హోటల్‌పై ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఓ ఉగ్రవాది ఒంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో చోట దాడికి యత్నించిన మరో ఉగ్రవాదిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story