వాస్తవికతకు దగ్గరగా తైవాన్ యుద్ధ విన్యాసాలు: సీనియర్ అధికారి

by Harish |   ( Updated:2024-06-23 03:00:45.0  )
వాస్తవికతకు దగ్గరగా తైవాన్ యుద్ధ విన్యాసాలు: సీనియర్ అధికారి
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా నుంచి తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్ ఈ ఏడాది వార్షిక యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. ఐదు రోజుల పాటు జరగనున్న వీటిని జులై 22న ప్రారంభించారు. దీనిలో భాగంగా సైనికులు తమ యుద్ధ ప్రతిభను ప్రదర్శిస్తారు. దాడులను ఎదుర్కొవడం, వేగంగా శ్రత్రువులపై దాడి చేయడం, యుద్ధం మధ్యలో గాయపడినట్లయితే ఏం చేయాలి తదితర వాటిపై సైనిక డ్రిల్ నిర్వహిస్తారు. తైవాన్ రక్షణ శాఖ సీనియర్ అధికారి, మాట్లాడుతూ, ఈ ఏడాది జరుగుతున్న యుద్ధ విన్యాసాలు వాస్తవ పోరాటానికి దగ్గరగా ఉంటాయని, ఈ విన్యాసాల్లో సైనికులు పాయింట్ల సాధించడం కోసం ప్రదర్శన ఇవ్వడమే కాకుండా చైనా నుంచి ఉన్నటువంటి ముప్పును ఎదుర్కొడానికి నిజమైన పోరాటంగా భావించాలని అన్నారు.

రక్షణ పోరాటాలు నిరంతరం ఆధునీకరించాలి. ఈ ఏడాది విన్యాసాలు రాత్రి పూట కూడా నిర్వహించబడతాయి. అన్ని వేళలా శ్రతువుల వైపు నుంచి వచ్చే దాడులను సమర్థంగా తిప్పికొట్టడానికి సైనికులు సిద్ధంగా ఉండాలి. ఈ డ్రిల్స్ నిరంతర అనుభవంగా ఉంటాయని, యుద్ధం రాత్రి, పగలు మధ్య తేడాను గుర్తించదు. అది ఎప్పుడైనా రావచ్చు. అందుకే రాత్రి సమయంలో విన్యాసాలను నిర్వహిస్తున్నామని, రియల్ టైమ్, ఆన్-ది-గ్రౌండ్ వెరిఫికేషన్‌తో మాత్రమే దళాల సామర్థ్యాలు, పరిమితులను మనం నిజంగా అర్థం చేసుకోగలమని అధికారి తెలిపారు.

ఏప్రిల్ నుంచి సైనిక కసరత్తులు మొదలు పెట్టిన తైవాన్, చైనా నుంచి వచ్చే దాడులను గట్టిగా ఎదుర్కొవాలని చూస్తుంది. మరోవైపు తైవాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చైనా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దానిని సొంతం చేసుకోవడానికి బలప్రయోగానికి సైతం దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తైవాన్ తన రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed