- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల సమ్మెతో సూపర్ మార్కెట్లు లూటీ.. పాపువా న్యూ గినియాలో అల్లరి మూకల విధ్వంసం (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో : పోలీసులు సమ్మెలో ఉండటంతో సూపర్ మార్కెట్లను అల్లరి మూకలు దోచుకున్న ఘటన పాపుమా న్యూ గినియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహా సముద్రానికి నైరుతి దిక్కున ఉన్న మెలనేషియా అనే ప్రాంతంలో కొన్ని దీవుల్లో పాపువా న్యూ గినియా దేశం విస్తరించి ఉంది. ఈ దేశంలో జీతాల చెల్లింపు వివాదం కారణంగా పోలీసులు సమ్మె చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. దేశ రాజధాని పోర్ట్ మోర్సిబిలోని సూపర్ మార్కెట్లు, దుకాణాల్లోకి దూరి అందినకాడికి సరుకులను లూటీ చేశారు. అనంతరం అక్కడే అల్లర్లు సృష్టించి కార్లను తగలబెట్టారు. ఈ అల్లర్లలో ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న దోపిడీ చోటుచేసుకోగా ఇవాళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని జేమ్స్ మరాపే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహించబోమని హెచ్చరించారు. తిరిగి శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.