Sri Lanka President Elections: నేడే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు..ఆ ముగ్గురి మధ్యే పోరు..!

by Maddikunta Saikiran |
Sri Lanka President Elections: నేడే శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు..ఆ ముగ్గురి మధ్యే పోరు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మన పొరుగు దేశం శ్రీలంక(Sri Lanka) గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో(Economic Crisis) కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న శ్రీలంకలో శనివారం దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు (President Elections) జరగనున్నాయి.ఆ దేశంలో దాదాపు 1.70 కోట్ల మంది ఓటర్లు(Voters) ఉన్నారు. ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 13,400 పోలింగ్​ కేంద్రాల(Poling Stations)ను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా ఈ సారి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే..ఈ ఎన్నికలో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముఖ్యంగా ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు(President of Sri Lanka),యునైటెడ్ నేషనల్ పార్టీ(United National Party)కి చెందిన రణిల్ విక్రమ సింఘే(Ranil Wickremesinghe)కు, విపక్ష నేత(Leader of the Opposition),సమగి జన బలవేగాయ పార్టీ(Samagi Jana Balawegaya Party)కి చెందిన సజిత్‌ ప్రేమదాస(Sajith Premadasa)తో పాటు నేషనల్ పీపుల్స్ పవర్(National People's Power) పార్టీకి చెందిన అనూర కుమార దిస్సనాయకే(Anura Kumara Dissanayake) గట్టి పోటీ ఇస్తున్నారు.1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి.ఒపీనియన్ పోల్స్ ప్రకారం త్రిముఖ పోరులో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని అంచనాలు వెలువడుతున్నాయి. శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనుండుగా ఆదివారం ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story