- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Weather Report: బిగ్ అలర్ట్! రాష్ట్రంలో రెండ్రోజులు భారీ వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 23 న వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
దీని ప్రభావం వలన రాష్ట్రంలో శనివారం మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజమాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జనగామ, హనుమకొండ, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.