NASA- SpaceX: ఆస్ట్రోనాట్స్ ని భూమిపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం

by Shamantha N |
NASA- SpaceX: ఆస్ట్రోనాట్స్ ని భూమిపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్ మోర్ కూడా స్పేస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో వారిని తిరిగి తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్‌ క్రూ-9 మిషన్‌ను ప్రయోగించినట్లు నాసా తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌ అంతరిక్షంలోని ఆస్ట్రోనాట్స్ ని తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు పేర్కొంది. ఇందులో నాసా వ్యోమగామి నిక్‌ హేగ్‌, రష్యన్‌ కాస్మోనాట్‌ అలెగ్జాండర్‌ గోర్బునోవ్ ఉన్నట్లు తెలిపింది. అందులోనే రెండు ఖాలీ సీట్లు ఉంచినట్లు పేర్కొంది. కాగా.. ఈ రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించిన నాసా, స్పేస్ ఎక్స్ లకు నాసా చీఫ్ బిల్ నెల్సన్ అభినందనలు తెలిపారు.

స్పేస్ లోనే చిక్కుకున్న..

ఇకపోతే, 8 రోజలు మిషన్‌లో భాగంగా సునితా విలియమ్స్, విల్‌మోర్‌లు జూన్ 6న బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే, జూన్ 14 వరకే వీరిద్దరూ భూమిపైకి తిరిగి ప్రయాణం కావాల్సి ఉంది. కానీ, స్పేస్ స్టేషన్ లో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీటిని పరిష్కరించిన బోయింగ్.. ఆస్ట్రోనాట్స్ భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ, నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్‌ న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌లో క్షేమంగా కిందకు దిగింది.

Advertisement

Next Story

Most Viewed