ట్రంప్‌పై కాల్పులు.. అమెరికా అధ్యక్షుడు జో జోడైన్ రియాక్షన్ ఇదే

by Satheesh |
ట్రంప్‌పై కాల్పులు.. అమెరికా అధ్యక్షుడు జో జోడైన్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తు తెలియని దుండుగులు ఒక్కసారిగా కాల్పులు జరపగా.. బుల్లెట్ ట్రంప్ కుడి చేవికి తగిలి గాయమైంది. ఈ క్రమంలో ట్రంప్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. దుండగులు దాడి నుండి ట్రంప్ క్షేమంగా బయటపడ్డారని.. ఆయన కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. అమెరికాలో హింసాకు తావు లేదని నొక్కి చెప్పారు. ట్రంప్‌పై కాల్పులు ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుండి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే, బుల్లైట్ గాయమైన ట్రంప్‌ను ఆయన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్, డెమోక్రటిక్ నుండి జో బైడెన్ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎలక్షన్ రేసులో ఉన్న ట్రంప్‌పై కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Advertisement

Next Story

Most Viewed