- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్: రెండో సారి ఎన్నికైన పీఎంఎల్ఎన్ నేత
దిశ. నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ 24వ ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతషెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఆదివారం పాక్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో హెహబాజ్‌కు 201 మంది సభ్యులు మద్దతు లభించగా.. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్‌కు 91 మంది మద్దతిచ్చారు. దీంతో షరీఫ్ ప్రధానిగా ఎన్నికైనట్టు పాక్ స్పీకర్ అయాజ్ సాధిక్ ప్రకటించారు. కాగా, పాక్ పీఎంగా షహబాజ్ ఎన్నిక కావడం ఇది రెండో సారి. గతంలో 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత మొదటి సారి ప్రధాని అయ్యారు. అంతకుముందు సభలో ఓటింగ్ సందర్భంగా పీటీఐ, పీఎంఎల్-ఎన్ సభ్యులు పోటా పోటీ నినాదాలు చేశారు.
ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో 265 స్థానాలకు గాను పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం)కి 17 సీట్లు వచ్చాయి. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీలు కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి..ప్రధాని అభ్యర్థిగా షరీఫ్‌ను ప్రకటించింది. తాజాగా జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఆయన పీఎంగా గెలుపొందారు. ఎంక్యూఎం పార్టీ కూడా షెహబాజ్‌కు మద్దతు ఇచ్చింది. కాగా, 1951 సెప్టెంబర్ 23న జన్మించిన షరీఫ్ ప్రస్తుతం పీఎంఎల్-ఎన్ చీఫ్‌గా ఉన్నారు. ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు పాక్ 23వ ప్రధాన మంత్రిగా పనిచేశాడు. గతంలో అతని సోదరుడు నవాజ్ షరీఫ్ సైతం పాక్ పీఎంగా బాధ్యతలు నిర్వహించాడు.