- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ రాజధానిలో లాక్‌డౌన్.. నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ దేశంలో షాంఘై సహకార సంస్థ (SCO) ప్రతినిధులు నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశానికి చైనా ప్రధాని లీ కియాంగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన నాలుగు రోజులపాటు ఇస్లామాబాద్ లోనే ఉండనున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు గాను.. ఇస్లామాబాద్ లో లాక్ డౌన్ విధించారు. ఇందులో భాగంగా..రాజధాని నగరంలో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని, వివాహ వేడుకలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ షాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో భారత్ సహా.. చైనా, ఇరాన్, రష్యా సహా తొమ్మిది సభ్య దేశాలు పాల్గొంటాయి.
ఇందులో కీలకమైన SCO సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుంది. ఈ సంస్థను 2001లో చైనా, రష్యాలు మధ్య ఆసియా, విస్తృత ప్రాంతంలోని భద్రతా సమస్యలను చర్చించడానికి స్థాపించాయి.ఈ SCO సమావేశంలో పాల్గొనేవారికి చైనా, రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రధాన మంత్రులతో పాటు ఇరాన్ వైస్ ప్రెసిడెంట్, భారతదేశ విదేశాంగ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశానికి ముందు పాకిస్థాన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అధికారులు సోమవారం నుండి ఇస్లామాబాద్‌లో మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవు ప్రకటించారు, పాఠశాలలు మరియు వ్యాపారాలు మూసివేశారు. నగరం అంతటా పెద్ద సంఖ్యలో పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు.