స‌ముద్రం కింద 'ప‌సుపు రాళ్ల‌తో రోడ్డు'.. షాకింగ్ డిస్క‌వ‌రీ! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-10-10 16:45:21.0  )
స‌ముద్రం కింద ప‌సుపు రాళ్ల‌తో రోడ్డు.. షాకింగ్ డిస్క‌వ‌రీ! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః "భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో.. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో.." అన్న దాశ‌ర‌థి మాటల్లో భూమి ఆవిర్భావంతో పాటు సామాజిక‌ చ‌రిత్ర కూడా అర్థ‌మ‌వుతుంది. ఇలా యుగాల కింద‌ ఏర్ప‌డిన నాగ‌రిక జీవనాలు ఎన్ని స‌ముద్ర గ‌ర్భంలో మునిగిపోయాయో ఇంకా ఆధునిక మాన‌వుడికి ఒక అంచ‌నా లేదు. క‌నిపించినవి మాత్ర‌మే తెలుసు, క‌న‌ప‌డ‌ని స‌త్యం మ‌రుగునే ప‌డుంటుంది. అయితే, తాజాగా హవాయి దీవులకు ఉత్తరాన లోతైన సముద్రపు శిఖరాన్ని చేరుకున్నారు కొంద‌రు ప‌రిశోధ‌కులు. ఈ యాత్రలో 'పసుపు ఇటుక రహదారి' ఒక‌టి వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. దీనితో పాటు, ఇక్క‌డ ఒక పురాతన ఎండిన సరస్సు కూడా క‌నిపించింది.

ప్రస్తుతం పాపహానౌమోకుకియా మెరైన్ నేషనల్ మాన్యుమెంట్ (PMNM) పరిధిలోని లిలియుకలాని రిడ్జ్‌ను సర్వే చేస్తున్న నాటిలస్ అనే అన్వేషక‌ నౌక ప్ర‌యాణంలో ఈ వింత ప్ర‌పంచం బ‌హిర్గ‌త‌మ‌య్యింది. PMNM ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర సంరక్షణ ప్రాంతాలలో ఒకటి. అలాగే, యునైటెడ్ స్టేట్స్‌లోని అన్ని జాతీయ పార్కుల కంటే ఇదే పెద్దది కావ‌డం విశేషం. అయితే, సముద్రపు అడుగుభాగంలో ఉన్న ఈ ఇటుక ర‌హ‌దానిరిని వాళ్లు 3% మాత్రమే అన్వేషించారు. ఇంకా దీనిని అన్వేషించాల్సి ఉంది. ఇక‌, ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌లోని పరిశోధకులు ప్ర‌స్తుతం దీని సరిహద్దులను గుర్తిస్తున్నారు. ఇది స‌ముద్ర మ‌ట్టానికి 3,000 మీటర్ల కంటే ఎక్కువ దిగువన ఉంది.

అయితే, యూట్యూబ్‌లో ఉన్న ఈ ప‌రిశోధ‌క వీడియోలో దీని గురించి కొన్ని వివ‌రాలు ఇస్తూ, ఈ పురాత‌న న‌గ‌రం 'అట్లాంటిస్‌కు వెళ్లే రహదారి'గా ఒక పరిశోధకుడు వీడియోలో చెబుతాడు. సముద్రంలో వేల కిలోమీటర్ల కింద ఉన్నప్పటికీ, నూట్కా సీమౌంట్ కొండ‌పైన‌ పరిశోధకులు కనుగొన్న సరస్సు పొడిగా కనిపించ‌డం ఆశ్చ‌ర్యక‌రంగా ఉందంటున్నారు. నిజానికి, Nautilusలో ప్ర‌చురించిన ఈ రిసెర్చ్ టూర్‌ను చూస్తే, 'మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడని భూ గ్రహంలోని కొన్ని ప్ర‌దేశాల‌ను చూడొచ్చు' అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed