- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
31 మంది మహిళలను హత్య చేసిన రష్యా సీరియల్ కిల్లర్‌కి జీవిత ఖైదు
by Harish |
X
దిశ, నేషనల్ బ్యూరో: 31 మంది మహిళలను హత్య చేసి రష్యా సీరియల్ కిల్లర్‌గా పేరొంది, వోల్గా ఉన్మాదిగా పిలవబడే రాడిక్ టాగిరోవ్ అనే వ్యక్తికి గరువారం జీవిత ఖైదు విధించినట్లు అక్కడి మీడియా నివేదించింది. రాడిక్, 2011-2012 మధ్య మాస్కోకు తూర్పున 730 కి.మీ దూరంలో ఉన్నటువంటి టాటర్స్తాన్ ప్రాంతంలో, అక్కడి చుట్టు ప్రక్కన నగరాల్లో 75 నుంచి 90 సంవత్సరాల వయస్సు కలిగిన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి గొంతుకోసి విలువైన వస్తువులు, డబ్బును దొంగిలించేవాడు. నిందితుడు సామాజిక కార్యకర్తగా, ఎలక్ట్రీషియన్‌గా, ప్లంబర్‌గా పేర్కొంటూ మహిళల ఇళ్లలోకి ప్రవేశించి వారిని హత్య చేసేవాడు. మొదటి తొమ్మిది హత్యలు కజాన్‌లో జరిగాయి. ఆ తరువాత వరుస హత్యలు చోటుచేసుకోగా 2020లో అతన్ని అరెస్టు చేశారు. అతను గతంలో చిన్న దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు.
Advertisement
Next Story