శాంతి శిఖరాగ్ర సదస్సును అడ్డుకునేందుకు రష్యా కుట్ర: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

by vinod kumar |
శాంతి శిఖరాగ్ర సదస్సును అడ్డుకునేందుకు రష్యా కుట్ర: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ శాంతి శిఖరాగ్ర సదస్సుకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఇప్పటికీ ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఈ సదస్సుకు దూరంగా ఉండాలని పలు దేశాలపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. కీవ్‌లో మీడియాతో సమావేశంలో జెలెన్ స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్ ప్రభుత్వం, పార్లమెంటు, ఇతర సంస్థల అధికారులు అతిపెద్ద భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి, శిఖరాగ్ర సమావేశాన్ని ప్రభావవంతంగా మార్చడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతిని మరింత దగ్గరగా తీసుకురావడానికి ఈ సదస్సు ఎంతో కీలకమని నొక్కి చెప్పారు.

దాదాపు 100 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సంఘర్షణను పరిష్కరించడానికి ఇప్పటికే కృషి చేస్తున్నాయని తెలిపారు. రష్యా శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించే అవకాశం లేదని, కానీ అలా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. వివిధ దేశాలను బహిరంగంగానే బెదిరిస్తోందని వెల్లడించారు. ప్రపంచం ఉగ్రవాద రాజ్యానికి ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల ఇటువంటి పరిణామాలే జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో జూన్ 15,16 తేదీల్లో ఉక్రెయిన్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇందులో వందుకు పైగా దేశాలు పాల్గొనే అవకాశం ఉంది. భారత్‌కు కూడా ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. శాంతి ప్రక్రియకు సంబంధించిన అంశాలను చర్చిందచనున్నారు. అయితే రష్యా లేకుండా శాంతి ప్రక్రియ జరగబోదని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సమావేశం ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసిన ముందస్తు చర్చల్లో యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, చైనా, ఇథియోపియా, సౌదీ అరేబియా వంటి దేశాల రాయబారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారికి పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed