Telegram: మేము చూస్తున్నాం.. ఫ్రాన్స్‌ను హెచ్చరించిన రష్యా

by Harish |
Telegram: మేము చూస్తున్నాం.. ఫ్రాన్స్‌ను హెచ్చరించిన రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను ఇటీవల ఫ్రాన్స్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా గురువారం ఫ్రాన్స్‌ను హెచ్చరించింది. ఆయన్ను రాజకీయంగా ఎలాంటి వేధింపులకు గురిచేయద్దని, క్రిమినల్ కేసును రాజకీయ హింసగా మార్చవద్దని హెచ్చరించింది. పావెల్ దురోవ్‌ రష్యాలో జన్మించారు. దీంతో ఆయనకు మద్దతుగా ఆ దేశ అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, "ఫ్రాన్స్‌లో ఏమి జరుగుతుందో చూస్తున్నాం, పావెల్‌ రాజకీయ హింసకు గురికాకుండా ఉండటమే ముఖ్యం. వాస్తవానికి అతనిని రష్యన్ పౌరుడిగా పరిగణిస్తున్నాం. వీలైనంత వరకు మేము సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని" అన్నారు.

మరోవైపు దురోవ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు ఫ్రెంచ్ న్యాయవాదులు తెలిపారు. వారానికి రెండుసార్లు పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయడంతోపాటు ఫ్రాన్స్‌లో ఉండాలనే షరతు, ఐదు మిలియన్ యూరోల పూచికత్తుతో బెయిల్‌ ఇచ్చారు. రష్యాలో అత్యంత ప్రజాధారణ కలిగిన టెలిగ్రాయ్ యాప్ వ్యవస్థపకుడిని తీవ్రవాద, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడంలో విఫలమయ్యారనే అనేక ఆరోపణలపై గత వారం పారిస్ విమానాశ్రయంలో అరెస్టు చేయగా, అప్పటి నుంచి అతన్ని కాపాడటానికి రష్యా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed