Russia-Ukraine War:ఉక్రెయిన్‍పై మరోసారి డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా..ఏడుగురు మృతి..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-04 21:11:21.0  )
Russia-Ukraine War:ఉక్రెయిన్‍పై మరోసారి డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా..ఏడుగురు మృతి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ర‌ష్యా(Russia) మ‌ళ్లీ ఉక్రెయిన్‌(Ukraine)పై అటాక్ చేసింది.రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత రష్యా తన వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని చారిత్రాత్మక కేంద్రం ఎల్వివ్‌(Lviv)పై రష్యా మరోసారి ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడింది.ఈ మిస్సైళ్ల‌ దాడిలో ఏడుగురు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇగోర్ క్లైమెంకో(Igor Klymenko) తెలిపారు.కాగా ఈ దాడిలో రష్యా ప్రయోగించిన ఏడు క్షిపణులు, 22 డ్రోన్‌లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపింది.అయితే మొన్న సెంట్రల్ సిటీ పోల్టావా(Poltava)లోని మిలిట‌రీ ఇన్స్‌టిట్యూట్‌పై జ‌రిగిన దాడి ఘటన మరవకముందే ర‌ష్యా మ‌రోసారి దాడి చేయ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారింది.ఈ దాడిలో మొత్తంగా 50 మంది వరకు మరణించారు.

అయితే రష్యా బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ నుంచే డ్రోన్లు, హైప‌ర్‌సోనిక్ మిస్సైళ్ల‌తో ఎల్వివ్‌పై దాడి చేసిన‌ట్లు సిటీ మేయ‌ర్ ఆండ్రీ స‌డోవీ (Andriy Sadovy) తెలిపారు. ఈ క్షిపణి దాడిలో 40 మంది గాయపడ్డారని, ఈ దాడిలో నగరంలోని చారిత్రక కేంద్రంలోని పాఠశాలలు , క్లినిక్‌లు దెబ్బతిన్నాయని చెప్పారు.దీంతో దేశం మొత్తం ఎయిర్ అల‌ర్ట్ జారీ చేసినట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ వెల్ల‌డించింది.కాగా దేశ రాజ‌ధాని కీవ్‌లో కూడా పేలుళ్ల శ‌బ్ధాలు వినిపించాయి.కాగా ఈ ఘటనపై అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelensky) స్పందించారు. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా తీవ్రవాదులు చేసిన దాడులని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడికి రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

Advertisement

Next Story