Samsung: ఎస్25 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసిన శాంసంగ్

by S Gopi |
Samsung: ఎస్25 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసిన శాంసంగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఎస్25 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గత సిరీస్‌ల తరహాలోనే ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 ఆల్ట్రా వంటి మూడు వేరియంట్లను తీసుకొచ్చిన కంపెనీ దేశీయంగానే తయారు కావడంతో మునుపటి వాటికంటే తక్కువ ధరలో లభించవచ్చనే అంచనాలున్నాయి. ఏఐ ఫీచర్లతో వచ్చిన ఎస్25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎస్25 టైటానియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్‌తో రావడమే కాకుండా సన్నగా, తేలికగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఏఐ-ఇంటిగ్రేటెడ్ వన్ యూఐ-7 సాఫ్ట్‌వేర్ రావడంతో సర్కిల్ టు సెర్చ్, కాల్ ట్రాన్‌స్క్రిప్ట్, రైటింగ్ అసిస్ట్, డ్రాయింగ్ అసిస్ట్ వంటి జెన్ ఏఐ ఫీచర్లు ఉంటాయి. కొత్త ఎస్25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ కూడా ఉందని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా గత కొన్ని నెలల నుంచి పెరుగుతునంద పర్సనల్ డేటా ఆందోళనల నుంచి క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రక్షణ లభిస్తుందని సాంసంగ్ తెలిపింది. ఎస్25 సిరీస్‌లో కంపెనీ అల్ట్రావైడ్ కెమెరాను 12ఎంపీ నుంచి కొత్త 50ఎంపీ సెన్సార్‌కి అప్‌గ్రేడ్ చేసింది. అలాగే, వీడియోలలో అవాంఛిత శబ్దాన్ని తొలగించడానికి ఆడియో ఎరేజర్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతానికి కంపెనీ భారత మార్కెట్‌కు సంబంధించి ధరల వివరాలు వెల్లడించలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.

Next Story