Russia: ఆరుగురు బ్రిటీష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు

by Shamantha N |
Russia: ఆరుగురు బ్రిటీష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆరుగురు బ్రిటీష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు వేసింది. గూఢచర్యం ఆరోపణలతో మాస్కోలోని ఆరుగురు బ్రిటన్‌ దౌత్యవేత్తలను బహిష్కరించినట్లుగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. రష్యాకు సంబంధించిన సైనిక, పాలనాపరమైన సమాచారాన్ని తమ శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లుగా ఆధారాలు లభ్యమయినట్లు వెల్లడించింది. దేశంపై వ్యూహాత్మక ఓటమిని కలిగిండమే వీరి పని.. ఇంటెలిజెన్స్ ఆధారాల సేకరణ, విధ్వంసక కార్యకాలాపాల్లో వారందరూ పాలుపంచుకున్నారని తెలిపింది. అయితే ఇప్పటివరకు లండన్‌కు, రష్యాకు మధ్య ఉన్న స్నేహపూర్వక చర్యల కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా దౌత్యవేత్తలను బహిష్కరించామని అని రష్యన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈవిషయంలో ఇతర బ్రిటన్‌ దౌత్యవేత్తల ప్రమేయం ఉందని తెలిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని తెలిపారు

ఉక్రెయిన్ కి సాయం చేసిన రెండ్రోజులకే..

కాగా, అమెరికా, బ్రిటన్.. ఉక్రెయిన్ కు దాదాపు 1.5 బిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించింది. ఇది జరిగన రెండ్రోజులకే ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించడం గమనార్హం. దేశానికి నష్టం కలిగించే గూఢచర్యమే కాకుండా ప్రజలకు హాని కలిగించే చర్యలకు ఆ దౌత్యవేత్తలు ఒడిగడుతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. అయితే ,ఈ ఆరోపణలపై మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందించలేదు. కాగా గూఢచర్యం ఆరోపణలతో రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్‌ ఇటీవల బహిష్కరించింది.

Advertisement

Next Story

Most Viewed