క్రెమ్లిన్ డ్రోన్ దాడి వెనుక అమెరికా హస్తం.. రష్యా ఆరోపణ

by Mahesh |
క్రెమ్లిన్ డ్రోన్ దాడి వెనుక అమెరికా హస్తం.. రష్యా ఆరోపణ
X

న్యూఢిల్లీ: అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయాలన్న ఉద్దేశంతో జరిగిన డ్రోన్ దాడి వెనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హస్తముందని రష్యా గురువారం ఆరోపించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ‘అమెరికా తన లక్ష్యాలకు గురిపెడుతోందని రష్యాకు తెలుసని వాషింగ్టన్ తెలుసుకోవాలి. యూఎస్ ప్రణాళికలను మాత్రమే ఉక్రెయిన్ అమలు చేస్తోంది’ అని పెస్కోవ్ అన్నారు.

అయితే యూఎస్‌పై చేసిన ఆరోపణలకు ఆయన ఎటువంటి ఆధారమూ చూపలేకపోయారు. బుధవారం ఉదయం జరిగిన సంఘటనలో తమ ప్రమేయాన్ని ఉక్రెయిన్ ఖండించింది. రెండు ఎగిరే వస్తువులు క్రెమ్లిన్ సమీపిస్తున్నట్టు, ఒకటి పేలినట్లు వీడియో ఫూటేజ్‌లో క్రెమ్లిన్ చూపించింది. ప్రతీకారం తీర్చుకుంటామని క్రెమ్లిన్ చెప్పింది. కానీ అది ఏ రూపంలో ఉంటుందో చెప్పలేదు. డ్రోన్ ఘటనపై విచారణ జరుగుతోందని పెస్కోవ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed