దేశ రాజధానిలో అల్లర్లు: ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని

by samatah |
దేశ రాజధానిలో అల్లర్లు: ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీలో అల్లర్లు చెలరేగగా..ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే 14 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రెండు నగరాల్లో జరిగిన అల్లర్లలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దుండగులు దుకాణాలను తగలబెట్టడగా 15 మంది మరణించారు. బుధవారం సాయంత్రం రాజధాని మోర్స్బీలో సైనికులు, పోలీసు అధికారులు, జైలు గార్డుల బృందం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన నేపథ్యంలో హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. దీని ప్రకారం.. అవసరమైన చోట బలగాలను మోహరించడానికి 1,000 కంటే ఎక్కువ మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. పరిస్థితులను అరిక్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, పపువా న్యూ గినియా పార్లమెంట్‌లో భద్రతా బలగాలు తమ వేతనాలను వివరణ ఇవ్వకుండా నిలిపివేసినందుకు నిరసన తెలిపారు. మరోవైపు లే నగరంలో కూడా అల్లర్లు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed