ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట

by Mahesh |
ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన ఇమ్రాన్‌ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. కాగా అతను కోర్టును ఆశ్రయించగా..రెండు వారాల రక్షణ బెయిల్ మంజూరు అయింది. ఆ తర్వాత కొద్ది కొద్ది నిమిషాల తర్వాత మే 9 తర్వాత దాఖలైన కొత్త కేసులో బుధవారం వరకు ఆయనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) శుక్రవారం నిషేధం విధించింది. ఇమ్రాన్ ఖాన్ బెయిల్ ను మరికొన్ని రోజులు పొడిగించాలని కోర్టును కోరగా సుదీర్ఘంగా చర్చించిన ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు జూన్ 8 వరకు పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed