అద్దె క‌ట్ట‌ట్లేద‌ని ఇంటి ఓన‌ర్ ఇలా చేశాడు..? పైసా వ‌సూలేనా..?!

by Sumithra |
అద్దె క‌ట్ట‌ట్లేద‌ని ఇంటి ఓన‌ర్ ఇలా చేశాడు..? పైసా వ‌సూలేనా..?!
X

దిశ, వెబ్‌డెస్క్ః 'శ‌త‌కోటి ద‌రిద్రాల‌కు, అనంత కోటి ఉపాయాలు' అనే సామెత మ‌నంద‌రికీ తెలిసింది. ఇది ద‌రిద్రుల ప‌ట్ల ఎంత నిజ‌మ‌వుతుందో కానీ కోటీశ్వ‌రుల విష‌యంలో మాత్రం అల్లోప‌తి మందులా క‌చ్ఛితంగా ప‌నిచేస్తుంది. ఓ ఇంటి య‌జ‌మాని కూడా త‌న స‌మ‌స్య‌కు ఇలాగే ఓ ఉపాయం ఆలోచించాడు. న్యూయార్క్ నగరంలో ఇళ్లు క‌ట్టుకొని, అద్దెకిచ్చుకునే ఓ 'కిరాయిల‌ వ్యాపారి' త‌న ఇంట్లో అద్దెకున్న‌వారితో విసిగిపోయి, అద్దెకున్నవారు త‌న‌కు $17,000 (రూ. 13 లక్షలు) బకాయిపడ్డార‌ని ఆరోపిస్తూ ఇంటి గోడ‌కు రెండు పెద్ద‌పెద్ద బ్యాన‌ర్లు త‌గిలించాడు. చూసినోళ్ల‌ళ్లో కొంద‌రు అయ్యో పాపం అంటుంటూ మ‌రికొంద‌రు ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అంటూ వేళ్లు విరుస్తున్నారు.

"మొదటి అంతస్తులో ఉన్న టెనెంట్‌లు అద్దె చెల్లించ‌ట్లేదు" అని ఈ బ్యాన‌ర్‌లో ఉంటుంది. రద్దీగా ఉండే బెల్ట్ పార్క్‌వేలో ఉన్న ఈ బ్యాన‌ర్ల‌ను చూస్తున్న జ‌నాలే కాకుండా, సోష‌ల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన ఫోటోలు చెక్క‌ర్లు కొడుతున్నాయి. టిక్‌టాక్ వీడియోలోనూ జోరుగా షేర్ అవుతోంది. ఇక‌, అస‌లు సంగ‌తి ఏమంటే, క‌రోనా మహమ్మారి కార‌ణంగా న్యూయార్క్ నగరంలో దాదాపు 2,00,000 ఉద్యోగాలు పోయాయి. ఖ‌రీదైన న‌గ‌రంలో అద్దెకుండే చాలా మంది కుటుంబాలు దీనితో క‌ష్టాల‌పాల‌య్యాయి. రాబ‌డి లేక ఇంట‌ద్దెలు క‌ట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి త‌రుణంలో ఈ ఇంటి ఓన‌ర్లు అద్దెను కూడా పెంచేసి, త‌క్ష‌ణ‌మే పెంచిన చార్జీల‌తో స‌హా అద్దె క‌ట్ట‌మ‌ని కూర్చున్నారు. ఇదేంట‌ని బేరానికి దిగిన అద్దెదారుల‌పై బ్యాన‌ర్లు వేయించి, ప్ర‌చారం చేస్తున్నారు. ఈ చ‌ర్య‌ను య‌జ‌మాని కుమారుడే వ్య‌తిరేకించ‌డం విశేషం. ఇలా అద్దెకున్న‌వారి ప‌రువు తీయ‌డం చాలా దారుణ‌మ‌ని య‌జ‌మానులైన థాంప్సన్స్ కుమారుడు కాల్విన్ జూనియర్ అన్నాడు. ఇక‌, దీనిపై చ‌ట్ట‌ప‌ర‌మైన మార్గాల‌ను అన్వేషిస్తున్నారు బాధితులు.

Advertisement

Next Story

Most Viewed