ఇరాన్‌లో నిరసనలు.. మరో ముగ్గురికి మరణ శిక్ష

by Sathputhe Rajesh |
ఇరాన్‌లో నిరసనలు.. మరో ముగ్గురికి మరణ శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల మహ్సాఅమిని మరణంపై ఇరాన్ లో పెద్ద ఎత్తున నిరసనలు జరగగా అందులో క్రీయాశీలంగా వ్యవహరించిన ముగ్గురికి ఇరాన్‌లోని ఖమేనీ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఇప్పటికే ఆ దేశంలో పది మందిని ఉరి తీసినట్లు సమాచారం. దేవుడిపై యుద్ధం ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిపై నేరం మోపి ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. ఈ ఘటనపై స్పందించిన ఈయూ, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఘటనను తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో బసిజ్ మిలీషియా సభ్యులను చంపిన ఆరోపణలపై ప్రస్తుతం సలేహ్ మిర్హషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబిలకు మరణ శిక్ష విధించింది. వీరు తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని సోమవారం మాట్లాడుతూ.. బహిరంగ స్థలాలకు నిప్పు పెట్టిన వారు ఎటువంటి సందేహం లేకుండా దేశద్రోహానికి పాల్పడినట్లే అని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed