- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హవ్వా..! ఈ కంపెనీ బ్రిటీష్ వర్కర్లను తీసేసి, ఇండియన్స్‌కి ఉద్యోగమిస్తుంది ఇందుకేనా..?!
దిశ, వెబ్‌డెస్క్ః 185 ఏళ్ల చరిత్రగల బ్రిటిష్ కంపెనీ ఇది. ప్రస్తుతం కొత్తగా భారతీయులనే నియమించుకుంటుంది. అయితే, దీని వెనుక పెద్ద స్కెచ్ లేకపోలేదు. ఇటీవల మార్చి 17న ఓడల కంపెనీ అయిన ఈ పీ&ఓ (P&O) తమ సేవలను నిలిపివేసి, 800 మంది బ్రిటీష్ కార్మికులను కూడా ఉద్యోగాల నుండి తొలగించింది. ఈ క్రమంలో తొలగించిన వర్కర్ల స్థానంలో చౌకగా దొరికే భారతీయ కార్మికులను చేర్చుకుంటుంది. దీనికి ముందు, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రైల్, మారిటైమ్, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ చెప్పినదాని ప్రకారం లివర్‌పూల్-డబ్లిన్ మార్గంలో రెండు P&O షిప్‌లు తమ సిబ్బంది ఫిలిపినోలకు గంటకు $3.47 చెల్లిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆ తర్వాత రోజే పాత సిబ్బంది స్థానంలో భారతీయ నావికులను తీసుకున్న పీ&ఓ వీళ్లకు మాత్రం గంటకు $2.38 చెల్లిస్తున్నట్లు తెలిపింది.
అయితే, యూనియన్ జనరల్ సెక్రటరీ మిక్ లించ్ దీనిని ఓ "షాకింగ్ దోపిడీ" అని, అలాగే బ్రిటీష్ సిబ్బందికి ఇది "ఘోరమైన ద్రోహం" చేశారని పేర్కొన్నారు. "ఈ ఓడలు ప్రయాణించడానికి అనుమతించకూడదు" అని లించ్ చెప్పాడు. ప్రభుత్వం దీనిపై కల్పించుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే, ఈ చర్య నైతికంగా తప్పు అయినప్పటికీ పూర్తిగా చట్టవిరుద్ధం కాదని కొందరు వాదిస్తున్నారు. ఇది గ్లోబల్ షిప్పింగ్‌లోని లొసుగులను ఉపయోగించుకుంటుందని ఇంకొందరు వాపోతున్నారు.
సాధారణంగా, భారతదేశంలో కెరీర్ ప్రారంభంలో ఉన్న నావలో పనిచేసే వ్యక్తి సంవత్సరానికి రూ. 3,00,000 సంపాదిస్తాడు. అంటే, ఒక వారం రోజుల్లో 6 రోజుల పనిదినాలకు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే, అది గంటకు రెండు డాలర్ల కంటే తక్కువ. విదేశాలలో కూడా అవి చాలా తక్కువనే చెప్పాలి. ఉదాహరణకు, చమురు ఉత్పత్తి ట్యాంకర్‌పై ఆసియా డెక్ క్యాడెట్‌కు నెలకు సుమారు 400 డాలర్లు చెల్లిస్తే, అమెరికా డెక్ క్యాడెట్ అదే ఉద్యోగానికి 950 డాలర్లు తీసుకుంటారు. దీన్ని బట్టి ఆ 400 డాలర్లు కూడా సాధారణ పని గంటలకు దాదాపు రెండు డాలర్లకంటే తక్కువే. నిజానికి, పాశ్చాత్య దేశాలన్నీ భారతీయులను వాడుకుంటున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ దోపిడీలో ఇదే మొదటి కంపెనీ కాదు, ఇదే చివరి కంపెనీ కూడా కాదు!