జపాన్ ప్రధానితో మోడీ భేటీ

by Javid Pasha |   ( Updated:2023-05-20 03:10:08.0  )
జపాన్ ప్రధానితో మోడీ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: జీ7 సమ్మిట్ లో భాగంగా జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి ప్రధాని ఫ్యూమియో కిషిడాతో శనివారం భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో కలిసి హిరోషిమాలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారిద్దరు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వ్యాపారం, ఆర్థికం, సాంస్కృతిక రంగాల్లో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే జీ20 సమావేశాలపై కూడా ఇరు నేతలు మాట్లాడుకున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పోక్స్ పర్సన్ ఎరిన్డమ్ బాగ్చి తెలిపారు.

Advertisement

Next Story