క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

by Javid Pasha |   ( Updated:2022-09-09 07:51:29.0  )
క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: యూకే రాణి క్వీన్ ఎలిజబెత్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అయితే, ఆమె మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన మోడీ క్వీన్ ఎలిజబెత్‌ను కలిసిన ఫొటోను షేర్ చేశారు. ఆమెతో ఎన్నో అద్భుతమైన సమావేశాలు తనకు ఉన్నాయని నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. '2015-2018 మధ్య నేను యూకే పర్యటనకు వెళ్లిన సమయాల్లో మ్యాజెస్టీ క్వీన్ ఎలిజబెత్-2తో ఎన్నో చిరస్మరణీయ సమావేశాలు జరిపాను. ఆమె దయాగుణాన్ని నేనెప్పటికీ మరువలేను' అని మోడీ రాసుకొచ్చారు.

అంతేకాకుండా ఆమె ఎందరికో స్ఫూర్తి దాయకమైన నాయకురాలిగా నిలిచారు, ధైర్యవంతురాలైన నాయకురాలిగా కూడా ఆమె చరిత్రలో నిలిపోయారు అని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యూకే చరిత్రలో అత్యధిక కాలం పాటు దేశానికి సేవలందించిన రాణి ఎలిజబెత్. అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆమె గురువారం రోజు కన్నుమూశారు. అయితే, ఆమె గత ఏడాది అక్టోబర్ నుంచి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని, ఇటీవల అనారోగ్యం తీవ్రతరం కావడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. అనారోగ్యం కారణంగా ఆమె నిలుచునేందుకు, నడిచేందుకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారని బంకిగామ్ పాలెస్ రిలీజ్ చేసిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.

Also Read : క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూత.. కోహినూర్ కిరీటం నెక్ట్స్ ఆమెకే

Advertisement

Next Story