Plane Crash : థాయిలాండ్ లో కుప్ప కూలిన విమానం.. 9 మంది దుర్మరణం..!

by Maddikunta Saikiran |
Plane Crash : థాయిలాండ్ లో కుప్ప కూలిన విమానం.. 9 మంది దుర్మరణం..!
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యాటక దేశం థాయిలాండ్ (Thailand)లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంగ్ పకాంగ్ జిల్లాలో చాచోయెంగ్‌సావోలోని అడవుల్లో ఓ విమానం కుప్ప కూలిపోయింది.ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ FL360aero తెలిపిన వివరాల ప్రకారం, థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ Cessna Caravan C208 (HS-SKR) కంపెనీకి చెందిన విమానం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.46 గంటలకు తొమ్మిది మంది టూరిస్టులతో బ్యాంకాంక్ లోని సువర్ణభూమి విమానాశ్రయం నుండి ట్రాట్ ప్రావిన్స్‌లోని కో మై చీ (Ko Mai Chee) విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ విమానానికి సువర్ణభూమి కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం.అయితే ఈ విమానంలో మొత్తం తొమ్మిది మంది ఉండగా అందులో ఐదుగురు చైనా కు చెందిన వాళ్లు అలాగే మరో ఇద్దరు థాయ్ ప్రయాణికులు, పైలట్ , కో-పైలట్ ఉన్నట్లు సమాచారం.సెర్చ్ టీమ్‌లు శకలాలను సేకరిస్తున్నాయని, అయితే గురువారం సాయంత్రం వరకు విమానంలో ఉన్నవారి జాడ కనిపించలేదని బ్యాంగ్ పకాంగ్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story