France : మధ్యధరా సముద్రంలో జెట్ విమానం క్రాష్.. ఎయిర్‌షో‌ లో ప్రమాదం

by Ramesh N |   ( Updated:2024-08-17 06:37:38.0  )
France : మధ్యధరా సముద్రంలో జెట్ విమానం క్రాష్.. ఎయిర్‌షో‌ లో ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఎయిర్ షో‌ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక జెట్ విమానం ఒక్కసారిగా సముద్రంలోకి దూసుకెళ్లి క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్లు అధికారులు దృవీకరించారు. ఈ ఘటన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని లావాండౌలో శుక్రవారం జరుగుతున్న డి-డే ల్యాండింగ్‌ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌షో నిర్వహంచారు. ఈ క్రమంలోనే ఫౌగా మెజిస్టర్ జెట్ విమానం మధ్యధరా సముద్రంలో కూలిపోయింది.

ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఎయిర్‌షోలో ఫ్రెంచ్ వైమానిక దళం 'పాట్రౌల్లె డి ఫ్రాన్స్' ఏరోబాటిక్స్ బృందం కూడా పాల్గొంటుంది. అయితే, క్రాష్ తర్వాత ఈవెంట్‌లో తన ప్రదర్శనను రద్దు చేయాలని బృందం నిర్ణయించుకుంది. కాగా, రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ సైనిక జెట్‌లు ఒకదానికి ఒకటి ఢీ కొనడంతో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించిన తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed