Philippines: ఫిలిప్పీన్స్‌లో తుపాన్ బీభత్సం.. 11 మంది మృతి

by vinod kumar |
Philippines: ఫిలిప్పీన్స్‌లో తుపాన్ బీభత్సం.. 11 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉష్ణమండల తుపాను కారణంగా ఉత్తర ఫిలిప్పీన్స్‌ ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ఘటనల్లో 11 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. తుపాన్ మనీలాకు ఆగ్నేయంగా ఉన్న బికోల్ ప్రాంతాన్ని దాటిన తర్వాత లుజోన్ ప్రధాన ద్వీపంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రభావం వల్ల మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందుజాగ్రత్తగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా 29 దేశీయ విమానాలను అధికారులు రద్దు చేశారు. మనీలాకు సమీపంలోని ఆంటిపోలోలో కొండచరియలు విరిగిపడటంతో గర్భిణీ స్త్రీతో సహా ముగ్గురు మరణించారని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. బికోల్ నగరం తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలిపాయి. 300 మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. సహాయక చర్యల్లో వేగం పెంచినట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed