మోడీ కాళ్లు మొక్కిన ఆ దేశ ప్రధాని.. వీడియో వైరల్

by Javid Pasha |   ( Updated:2023-05-23 07:24:43.0  )
మోడీ కాళ్లు మొక్కిన ఆ దేశ ప్రధాని.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన స్వాగతం లభించింది. సాక్షాత్తు ఓ దేశ ప్రధాని ఆయన కాళ్లు మొక్కుతూ సాదరంగా తమ దేశంలోకి ఆహ్వానించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ (FIPIC) మూడవ సమ్మిట్ లో పాల్గొనేందుకు పీఎం మోడీ మొదటిసారి పాపువా న్యూ గినీ దేశంలో పర్యటించారు. అందులో భాగంగా ఆ దేశ రాజధాని పోర్ట్ ఫోరెస్బీ ఎయిర్ పోర్టులో దిగారు. అయితే అప్పటికే భారత ప్రధాని కోసం అక్కడ వేచి చూస్తున్న పాపువా న్యూ గినీ ప్రధాని జేమ్స్ మరాపె.. మోడీ ఫ్లైట్ దిగి కింది రాగానే ఆయన వద్దకు వెళ్లారు. అనంతరం మోడీ కాళ్లకు నమస్కరించి సాదరంగా స్వాగతం పలికారు. ఇక పాపువా న్యూ గినీ ప్రధాని అపూర్వ స్వాగతానికి ఫిదా అయిన మోడీ.. ఆనందంతో ఆయనను ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం పాపువా న్యూ గినీలో తనకు లభించిన అపూర్వ మర్యాద గురించి పీఎం మోడీ ట్విట్టర్ లో తెలిపారు. ‘‘ ఈ రోజు పాపువా న్యూ గినీలో పర్యటించాను. అక్కడి ప్రధాని జేమ్స్ మరాపె నాకు పలికిన అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు. ఆ దేశంతో సత్సంబంధాలను కొనసాగించడానికి భారత్ ఉవ్విళ్లూరుతోంది’’ అని కామెంట్ చేశారు. కాగా సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత పాపువా న్యూ గినీ దేశంలోకి వేరే దేశాల నుంచి నేతలు వచ్చినప్పుడు అక్కడి ఆచారం ప్రకారం ఎలాంటి మర్యాదలతో స్వాగతం పలుకరు. కానీ భారత ప్రధాని విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. మోడీ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ దేశానికి వెళ్లినా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.

Advertisement

Next Story

Most Viewed