- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిడిల్‌ఈస్ట్‌లో శాంతి కోసం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలి: UN
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కిడి ప్రజల పరిస్థితి అద్వానంగా మారిపోయింది. దీంతో ప్రపంచ దేశాలు ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మిడిల్‌ఈస్ట్‌లో శాంతి నెలకొల్పేందుకు అన్ని దేశాలు కూడా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం సోమవారం పిలుపునిచ్చింది. ఇప్పటికే స్పెయిన్, ఐర్లాండ్, నార్వేలు అధికారికంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించగా, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి బృందం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
పాలస్తీనా భూభాగాల్లోని మానవ హక్కుల పరిస్థితిపై UN ప్రత్యేక ప్రతినిధితో సహా నిపుణులు, పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడం అనేది పాలస్తీనా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం వారి పోరాటానికి ముఖ్యమైన అంగీకారమని అన్నారు. అన్ని దేశాలు కూడా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించినట్లయితే తక్షణం గాజాలో కాల్పుల విరమణ మొదలవుతుంది. అలాగే రఫా నగరంలో కూడా ఇజ్రాయెల్ సైనిక చొరబాట్లు ఉండవని చెప్పారు. అయితే ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం వ్యాఖ్యాలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. అంతకుముందు స్పెయిన్, ఐర్లాండ్, నార్వేలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఈ దేశాలు మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ అయిన హమాస్‌ను బలపరిచారని విమర్శించింది.