గ్వాదర్ పోర్టుపై ఉగ్రదాడి.. ఏడుగురు టెర్రరిస్టులు హతం

by Hajipasha |
గ్వాదర్ పోర్టుపై ఉగ్రదాడి.. ఏడుగురు టెర్రరిస్టులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ ఉగ్రదాడితో అట్టుడికింది. బుధవారం ఉదయం గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొరబడిన కొందరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని పెద్దసంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలు చుట్టుముట్టి ప్రతికాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌ పరిసరాలు కొన్ని గంటల పాటు పేలుళ్ల శబ్దాలు, తుపాకీ కాల్పుత మోతలతో దద్దరిల్లాయంటూ పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి బాధ్యత వహించిందని సమాచారం. గ్వాదర్ పోర్టు బెలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. బెలూచిస్తాన్‌ను స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా లేదా దేశంగా ప్రకటించాలని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. గ్వాదర్ పోర్టులో చైనా పెట్టుబడులు పెడుతుండటాన్ని అది వ్యతిరేకిస్తోంది. సహజ వనరులకు నెలవుగా ఉన్న బెలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్, చైనా ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని బీఎల్ఏ ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed