పాకిస్థాన్‌లో న‌డిరోడ్డుపై ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌.. నివ్వెర‌పోయిన జ‌నం! (వీడియో)

by Sumithra |
పాకిస్థాన్‌లో న‌డిరోడ్డుపై ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌.. నివ్వెర‌పోయిన జ‌నం! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆఫ్ఘ‌నిస్థాన్ మేర కాక‌పోయినా పాకిస్థాన్ కూడా స్త్రీల ప‌ట్ల‌ ఆంక్ష‌ల కాసారం అని అనుకుంటారు. నిజమే కావ‌చ్చుగాక‌, కానీ అక్క‌డ కూడా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న ర‌క‌ర‌కాల దాడుల‌కు నిర‌స‌న‌గా పోరాటాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయినా, మహిళ‌లు ఇలాగే ఉండాల‌నే భావం చాలా మందిలో ఉంది. దాన్ని రుజువు చేస్తూ, ఓ వీడియో ఇంటర్నెట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. స్వేచ్ఛ‌ను ఇలా అభాసుపాలు చేస్తారా అంటూ స్వేచ్ఛ‌ను త‌ప్పుగా నిర్వ‌చిస్తున్న ఓ వ్య‌క్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వివ‌రాల్లోకి వెళితే.. ఒక అమ్మాయి ఇస్లామాబాద్‌లోని బహిరంగ ప్రదేశంలో రోడ్డు మ‌ధ్య‌లో ఉన్న డివైడ‌ర్‌పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అక్క‌డున్న సైన్ బోర్డు పోల్‌ను ప‌ట్టుకొని డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంది. ఇది చూస్తున్న దూరంగా ఉన్న ఒక వ్య‌క్తి కెమెరాను జూమ్ చేసి, వీడియో చిత్రీకరించాడు. ఆ త‌ర్వాత ఆమెను నిందిస్తూ, దీన్ని ఇస్లామాబాద్ పోలీసు అధికారి ఖాతాకు ట్యాగ్ చేస్తాడు. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆ అమ్మాయిపై 'అవసరమైన చర్య తీసుకోండని కోర‌తాడు. ఇక‌, ట్విట్ట‌ర్‌లో ఇది చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది. లింగ పక్షపాత చర్చకు దారితీసింది. చివ‌రికి, ఇస్లామాబాద్ పోలీసులు ఆ యువ‌తి మ‌తి స్థిమితం లేని వ్య‌క్తి అని, ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ, వీడియో తీసే వారు మాట్లాడిన మాట‌లపై కొంద‌రు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా, ఇంకొంద‌రు, ఆమె అలా చేయ‌డం స‌భ్య‌త కాదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed