- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakistan : ప్రాచీన ఆలయం పునర్నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసిన పాక్
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ నరోవల్ జిల్లా జఫర్వాల్ పట్టణంలో ఉన్న బావోలీ సాహిబ్ హిందూ ఆలయం పునర్నిర్మాణ పనులకు కోటి రూపాయలు మంజూరు చేసింది. బావోలీ సాహిబ్ హిందూ ఆలయం గత 64 ఏళ్లుగా పూజలకు, కనీస నిర్వహణకు నోచుకోకుండా ఉండిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) ఆధ్వర్యంలో ఆలయం పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఆలయాన్ని నిర్మించిన అనంతరం పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు.
ఎందుకంటే.. బావోలీ సాహిబ్ ఆలయం పునరుద్ధరణ పనుల కోసం గత 20 ఏళ్లుగా ఈ కమిటీయే గళం వినిపిస్తోంది. నరోవల్ జిల్లాలో దాదాపు 1,453 మందికిపైగా హిందువులు ఉన్నప్పటికీ.. ఒక్క హిందూ ఆలయం కూడా లేదు. దీంతో ఆలయాన్ని దర్శించుకోవాలని భావించే నరోవల్ జిల్లావాస్తవ్యులు సియాల్‌కోట్, లాహోర్ నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. బావోలీ సాహిబ్ హిందూ ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక హిందువుల చిరకాల వాంఛ నెరవేరుతుంది.